ప్రముఖ బాలీవుడ్ టీవీ నటి లీనా ఆచార్య కన్ను మూసారు.ఆమె ‘సేత్ జి’, ‘ఆప్ కే ఆ జానే సే’, ‘మేరి హానికారక్ బివి’ వంటి ఎన్నో పాపులర్ హిందీ టీవీ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటన అందం అభినయంతో అనేకమంది అభిమానులని సొంతం చేసుకుంది.లీనా శనివారం అనగా నవంబర్ 21న ఢిల్లీలో కన్నుమూశారు. కిడ్నీలో సమస్య కారణంగా ఆమె మరణించారు.