సూపర్ స్టార్ మహేష్ బాబుకి తమిళ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ స్టార్ హీరోలకి సమానంగా మహేష్ ని కొనియాడుతారు. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం. నవంబర్ 20న ఈ చిత్రం తమిళంలో 220 థియేటర్లలో 50 శాతం ఆకుపెన్సీ తో విడుదలయ్యింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిత్రానికి అక్కడ పాజిటివ్ టాక్ వస్తుండడం విశేషం. మాస్ ఎంటర్టైనర్ అంటూ ఈ చిత్రాన్ని అక్కడి ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం అక్కడ మొదటి రోజు 0.12 లక్షల గ్రాస్ వసూళ్ళను రాబట్టిందట. ఓ డబ్బింగ్ చిత్రానికి అదీ కరోనా టైములో ఇలాంటి కలెక్షన్స్ ఎక్కువనే చెప్పాలి.ఈ టైములో కూడా అక్కడ స్టడీగా కలెక్షన్లు రాబడుతూ దుమ్ము రేపుతోంది ఈ సినిమా...ఈరోజు నిన్నటికి మించి బుకింగ్స్ నమోదవుతున్నాయని సమాచారం.