‘సాహో’ ప్రీమియర్ టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 5.81 టి.ఆర్.పి రేటింగ్ మాత్రమే నమోదయ్యింది. అటు తరువాత రెండు వారాలకు ఈ చిత్రాన్ని మళ్ళీ టెలికాస్ట్ చెయ్యగా.. అప్పుడు కూడా కేవలం 4.11 టి.ఆర్.పి రేటింగ్ ను సాధించి నిరాశపరిచింది..టైం కాని టైంలో ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చెయ్యడం వలన మరీ ఘోరమైన టి.ఆర్.పి రేటింగ్ లు నమోదవుతున్నాయి. ఈ సినిమాని కొన్న ఛానల్ వాళ్ళు ఎందుకు కొన్నాము అని తెగ బాధ పడిపోతున్నారట. ‘కె.జి.ఎఫ్’, ‘ఐ’ వంటి చిత్రాలు ఆలస్యంగా టెలికాస్ట్ అయినప్పటికీ మంచి టి.ఆర్.పి రేటింగ్ లనే నమోదు చేసాయి. అయితే ‘సాహో’ విషయంలో అలా జరగడం లేదు. ఇలా అయితే.. ‘సాహో’ చిత్రం శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేసిన ‘జీ తెలుగు’ వారు సేఫ్ అవ్వడం కష్టమనే చెప్పాలి.