గౌతమ్‌తో పెళ్లికి ఒప్పుకోవడానికి ఓ రీజన్ ఉందని చెప్పింది కాజల్.. అదేంటంటే..అందరు అమ్మాయిల్లానే.. తనకు కాబోయేవాడు మోకాళ్లపై నిలిచి ఎర్రని గులాబి అందించి తన ప్రేమను వ్యక్తం చేయాలని కోరుకుందట. ఇక కాజల్ ఎలా అయితే ఆశపడిందో.. ఆ విధంగానే గౌతమ్ కిచ్లు తనకు ప్రపోజ్ చేశాడట. దీంతో కాజల్ గౌతమ్‌తో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఒకవేళ అలా చేయకపోతే అతడితో పెళ్లి కష్టమే అని సరాదాగా కామెంట్ చేసింది. ప్రతి అమ్మాయికి అలా తాను పెళ్లి చేసుకోబోయేవాడితో రాజా పూవ్వు అందుకోవాలని కోరుకుంటుందని చెబుతోంది కాజల్. గౌతమ్ ముందే తన పేరెంట్స్ తో మాట్లాడి సంబంధం పెళ్లి ఫిక్స్ చేసేసుకున్నాడని అయినా కానీ తనకు మోకాళ్ల ఉండి ప్రపోజ్ చేయాలని రూల్ పెట్టానని కూడా కాజల్ చెప్పింది.