ఛత్రపతి శివాజీ అజేయమైన వారియర్ స్టోరీతో ఎస్.ఎస్.రాజమౌళి సినిమా తెరకెక్కించనున్నారని గుసగుసలు స్ప్రెడ్ అయ్యాయి. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ ఈ తరహా కథను లాక్ చేశారని రాజమౌళి తదుపరి చిత్రం ఇదేనని ప్రచారమవుతోంది.అయితే ఈ మూవీలో కథానాయకుడు ఎవరు? అంటే .. ఇప్పటికే మహేష్ హీరోగా రాజమౌళి సినిమా క్యూలో ఉంది. అంటే ఛత్రపతిగా నటించేది మహేష్ బాబు అని మరో ప్రచారం వేడెక్కిస్తోంది.అయితే ఇది నిజమా? అంటే ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ అయితే లేదు. చాలామంది ఈ న్యూస్ ని కొట్టి పారేసినా ..కొంతమంది మాత్రం ఇందులో వాస్తవం కూడా ఉండొచ్చు కదా అన్న రీతిలో మాట్లాడుతున్నారు.