మాల్దీవుల్లోని ఉత్తరాదిన ఉన్న ఓ ద్వీపంలో ఈ అక్కినేని దంపతులు ఉన్నట్లు సమాచారం. అయితే అక్కడ స్కూబా డైవింగ్ చేస్తూ దిగిన ఓ పిక్ షేర్ చేసిన సమంత.. ''మొత్తానికి సాధించా, సముద్రంలో డైవ్ చేశా..'' అంటూ ఎక్సయిట్ అయింది. ఇది చూసిన అక్కినేని అఖిల్.. ''వావ్.. ఆశ్చర్యంగా ఉంది. నేను నమ్మలేకపోతున్నా'' అని కామెంట్ పెట్టడం అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటోంది.