టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసాడు సుకుమార్. ప్రేక్షకులు అసలు ఈ కాంబినేషన్ ఉంటుందా అని కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు పూర్తిగా డిఫరెంట్ అనే చెప్పాలి .అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో మూవీ ప్రకటించే సరికి .సాధారణ ప్రేక్షకులు సైతం ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ తో కేదార్ అనే కొత్త నిర్మాత ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సినిమా సెట్స్ పైకి రాకముందే ఈ మూవీకి సంబంధించి వినిపిస్తున్నా పారితోషికాలు హాట్ టాపిక్ గా మారాయి.ఈ సినిమాకు విజయ్ దేవరకొండ 11 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడట. అక్కడితో ఆగడం లేదు, ఈ ఎమౌంట్ కు తోడు.. దాదాపు 3 కోట్ల రూపాయల ఖరీదైన ఓ ఫారిన్ కారును కూడా అందుకోబోతున్నాడు.  ఇదంతా ప్యాకేజీలో భాగమే.ఇక సుకుమార్ విషయానికొస్తే.. ఈ సినిమాతో కెరీర్ లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడు ఈ దర్శకుడు. దేవరకొండతో చేయబోయే సినిమా కోసం ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.