ఏడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో వచ్చి మరోసారి ఇండస్ట్రీ హిట్టందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయం సాధించడంతో మరోసారి వీరి కాంబో వస్తుందనే టాక్ విన్పించింది ఇండ్రస్టీ లో.దీనికి సంబంధించి ఇటీవల మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనిల్ రావిపూడి మరోసారి కలిసే పని చేసేందుకు సిద్ధమనేని ప్రకటించాడు.  మంచి కథతో తన వద్దకు వస్తే గ్రీన్ సిగ్నల్ ఇస్తానంటూ చెప్పాడు.నేడు దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై స్పందించారు. తాను మహేష్ బాబుతో మరో సినిమా చేసేందుకు ఇప్పటికే ఓ కథను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆయన నుంచి ఎప్పుడు పిలుపిస్తే అప్పుడు వెళ్లి కథను విన్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. దీంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్ సెట్ అవుతుందనే టాక్ విన్పిస్తోంది.