లవ్ స్టోరీ చిత్ర బృందం వారు తాజాగా విడుదల చేసిన చైతూ బర్త్ డే స్పెషల్ పోస్టర్ చూస్తే.. ఆయన లుంగీ, బనియన్ మీద కనిపిస్తున్నారు. నిత్య జీవితంలో మనల్ని మనం పోల్చుకునే ఓ సాధారణ యువకుడి పాత్రలో నాగ చైతన్య సహజంగా నటిస్తున్నట్లు ఈ లుక్ ద్వారా తెలుస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల మార్క్ క్యారెక్టరైజేషన్ చైతూ లుక్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.