రజినీకాంత్ ఆరోగ్యం బాగలేదని తెలుసుకున్న అభిమానులు చాలా కంగారు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన చాలా సార్లు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అందుకే ఆ మధ్యన ఫారెన్ కి వెళ్లి నెలల పాటు అక్కడే ఉండి చికిత్స తీసుకొని వచ్చారు. ఆ తరువాత కొన్ని రోజుల పాటు ఆయన బాగానే ఉన్నారు. అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతున్నప్పటికీ వెంటనే కోలుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.