'వకీల్‌సాబ్' తర్వాత పవన్ ఖచ్చితంగా క్రిష్ సినిమానే చేస్తాడనేలా వార్తలు నడుస్తున్నాయి. పవన్ లుక్ కూడా ఈ సినిమా కోసం అనేలా మార్చాడు.ఇక ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తుందనే విషయం తెలిసిందే.మరో హీరోయిన్గా ఈ సినిమాలో నిధి అగర్వాల్ అంటూ వార్తలు నడిచాయి. కానీ తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్గా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి చేస్తుందని అంటున్నారు. అంతేకాదు..ఈ సినిమాలో ఆమె పాత్ర ఇదంటూ కొన్ని వార్తలు కూడా సంచరిస్తున్నాయి. ఈ సినిమాలో సాయిపల్లవి జమీందారి కుటుంబ అమ్మాయిగా కనిపిస్తుందని అంటున్నారు. ఆమె పాత్ర సినిమాకి హైలెట్ అనేలా ఉంటుందని, అందుకే సాయిపల్లవి ఈ సినిమా చేయడానికి అంగీకరించిందని అంటున్నారు.