పెద్ద హీరోల సినిమా ఆఫర్లు రాకపోవడంపై కాస్త వెటకారంగా స్పందించాడు  కోటి. తాను ఇప్పటి వారికి తగ్గట్లుగా అప్ డేట్ అవ్వాలేమో. నాకు రావాల్సిన ఆఫర్లు మరెవ్వరైనా ఆపేస్తున్నారేమో. గతంలో త్రివిక్రమ్ సినిమాకు కూడా సంగీతాన్ని అందించిన తాను ఇప్పుడు వారికి పనికి రావడం లేదు అన్నాడు.త్రివిక్రమ్ సినిమాకు మంచి పాటలు ఇచ్చాను.  కాని మళ్లీ అతడు ఎప్పుడు కూడా తన సినిమాకు పాటలు ఇవ్వమని అడగలేదు. ఛాన్స్ ఇవ్వమని నేను కూడా అతడిని అడగలేదు. ఒకసారి మంచి పాటలు ఇచ్చినందుకు మళ్లీ కలిసి పని చేయాలని అతడికే ఉండాలి కదా అంటూ త్రివిక్రమ్ ను విమర్శించినట్లుగా కోటి ఇండైరెక్ట్ కామెంట్స్ చేశాడు.