త్వరలోనే కోలీవుడ్ ఇండ్రస్టీ లో ఎంట్రీ ఇవ్వనుంది. కార్తి సరసన సుల్తాన్ అనే సినిమాతో కోలీవుడ్ అరంగేట్రం చేయబోతోంది రష్మీక. 'రెమో' ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.తాజా సమాచారం ప్రకారం రష్మికకు కోలీవుడ్లో మొదటి సినిమా విడుదలవక ముందే మరో క్రేజీ ఆఫర్ వరించిందట.  కార్తి సోదరుడు, ప్రముఖ హీరో సూర్య సరసన రష్మిక ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. పాండిరాజ్, సూర్య కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్గా రష్మికను అనుకుంటున్నారట.సూర్యతో జోడీ కట్టేందుకు రష్మిక కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోందట. ఈ కాంబినేషన్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందట.