నాగబాబు తన  ఓ వీడియోలో నిహారిక, వరుణ్ తేజ్‌తో తన రిలేషన్ ఎలా ఉంటుందనే విషయంపై ఓపెన్ అయ్యారు.ఈ వీడియోలో ఈ విధంగా స్పందించాడు.. ''నేను గొప్ప కమ్యూనికేటర్‌ని కాకపోవచ్చు గానీ ఎంతోకొంత బెటర్ అని నా ఫీలింగ్. నా పిల్లలు నిహారిక, వరుణ్‌లకు చాలా విషయాలు కూలంకషంగా చెప్పేవాడిని. ఒక్కోసారి పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తిట్టడం, కొట్టడం లాంటివి కూడా చేసేవాడిని. నిహారిక, వరుణ్‌లను ఒకటి రెండు సార్లు కొట్టాను కూడా. కానీ పిల్లలను కొట్టకూడదు. అది నేను చేసిన తప్పు. ఆ టైమ్‌లో నాకు మెచ్యూరిటీ లేక అలా చేశాను.పిల్లలకు నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే.. మీరు మొదట తల్లిదండ్రులతో ఫ్రీ గా మాట్లాడండి. అన్నీ షేర్ చేసుకోండి. పిల్లలిద్దరినీ పిలిచి వాళ్లకు ఓ గ్యారెంటీ ఇచ్చాను.అని చెప్పాడు.