ఇప్పటిదాకా బిగ్ బాస్ సీజన్లకి జూనియర్ ఎన్టీఆర్, నాని ఇంకా నాగార్జునలు హోస్టులుగా వ్యవహరించారు. ఈ సారి నటసింహం బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహిస్తున్నాడు అంటే.... ఏంటి బాలయ్య బిగ్ బాస్ హోస్టా మతి ఎమన్నా పోయిందా... అయన తన ఫ్యాన్స్ ఫోటో అడిగితేనే గూబ గుయ్యిమనిపించాడు. అలాంటిది బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వస్తే ఇంకేమైనా వుందా.. బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఇక దబిడిదిబిడే.. మాములుగా చిన్న తప్పు జరిగితేనే బాలయ్య బాబు తట్టుకోలేరు. ఇక ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో లో గొడవలు కొట్లాటలు జరిగితే ఊరుకుంటాడా.. ఒక్కొక్కరిని వాయించడు. అలాంటి బాలయ్య ఈ బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వస్తాడా... ఆయన హోస్ట్ గా వ్యవహరించే అవకాశమే లేదు.. అని అనుకుంటున్నారా..! ఇది జరగని పని అని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు కానీ.. బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌కి మాత్రం బిగ్ బాస్ హోస్ట్‌గా బాలయ్యను చూడాలని ఉందంట. ఏంటి?? కామెడీ చేస్తున్నాడా.. రాహుల్ అంటే ఇంచు మించు అలాంటిదే.నాగార్జున హోస్ట్‌గా.. చిరంజీవి గెస్ట్‌గా బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అవార్డ్ అందుకున్న రాహుల్‌కి ఓ విచిత్రమైన కోరిక ఉందట.