రెండో సినిమానే ప్రభాస్ లాంటి నేషనల్ స్టార్ తో సినిమా చేసే అవకాశాన్ని పొందాడు సుజిత్.. అయితే ఆ అవకాశాన్ని చాలావరకు ఉపయోగించుకోలేకపోయాడు అని చెప్పాలి.. సాహో సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. అంతేకాదు ఈ సినిమా పరాజయం క్రెడిట్ మొత్తం డైరెక్టర్ మీదుగానే వెళ్ళిపోయింది. ప్రభాస్ అంత బాగానే చేశాడు కానీ డైరెక్టర్ చెడగొట్టాడు అనేంతగా సుజిత్ పై ట్రోల్ జరిగింది.'సాహో' తెలుగులో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా హిందీలో మాత్రం సత్తా చాటింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ రాబట్టడంతో సుజిత్ పేరు మారుమోగిపోయింది. అయితే యువ దర్శకుడికి అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదని తెలుస్తోంది.