మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. సినీ పరిశ్రమకు కొన్ని సవరణలు చేస్తూ.. వరాల జల్లు కురిపించారు. కొన్ని ముఖ్యమైన ప్రకటనలతో పరిశ్రమను ఆకట్టుకున్నారు .అందులో భాగంగానే రాజమౌళి , సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ "తెలంగాణ సీఎం కెసిఆర్ గారు ప్రకటించిన చాలా అవసరమైన సహాయక చర్యలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఆనందిస్తోంది! ఇవి తప్పనిసరిగా బంతిని కోర్టులోకి తెచ్చి మళ్లీ పురోగతి మార్గంలో పయనించే ఛాన్సిస్తాయి. మీకు ధన్యవాదాలు సార్..@ తెలంగాణ సిఎంఓ`` అంటూ సోషల్ మీడియాల్లో వ్యాఖ్యానించారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ దర్శకనిర్మాతలు,నటీనటులు.. మన కేసీఆర్ గారికి ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.