ఆకాశం నీ హద్దురా’ సినిమా తర్వాత హరితో సినిమా చేయనున్నట్లు సూర్య గతంలోనే ప్రకటించారు. అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో సూర్య తన సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌కి భారీ ధరకు అమ్మేశారు. దీంతో సూర్యపై థియేటర్ల సంఘం మండిపడింది. ఇకపై సూర్య సినిమాలు థియేటర్లలో ప్రదర్శించబోమని, ఆయన నిర్ణయం తమ ఉపాధిని దెబ్బతీస్తుందని మండిపడ్డారు. ఈ విషయంలో దర్శకుడు హరి కూడా సూర్య నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయిని, దీంతో సినిమా ఆగిపోయిందటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను సూర్య కొట్టి పారేశాడు. ‘హరి సర్ తో చేసేది భారీ బడ్జెట్ సినిమా.. అందుకే ఆలస్యవుతోంది. స్క్రిప్ట్ కూడా ఫైనల్ స్టేజిలో ఉంది’ అంటూ క్లారిటీ ఇచ్చాడు.