మహేష్ బర్త్ డే, సినిమాల విడుదల సమయంలో సోషల్ మీడియాలో రికార్డు స్తాయిలో రెస్పాన్స్ వస్తోంది. మహేష్‌కు ట్విట్టర్లో 10.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే కోటి తొమ్మిది లక్షలన్నమాట.దీంతో దక్షిణాది హీరోల్లోనే అత్యధిక ఫోలోవర్స ఉన్న హీరోగా రికార్డు సాధించాడు. అయితే ఇటీవల మహేష్ ఇన్‌స్టాలోనూ రికార్డు చేశాడు. ఇన్‌స్టాలోనూ 6 మిలియన్ల ఫాలోవర్సు నమోదయ్యారు. ఈ న్యూస్‌ను అతడి అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మహేష్ పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నాడు.మహేష్ సరసన కీర్తీ సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.