ఇప్పుడున్న పరిస్థితిలో ఏ హీరో కూడా థియేటర్ లో సినిమా రిలీజ్ చేసేందుకు ముందుకు రావడం లేదు. హీరోలే వెనకాడుతోన్న సమయంలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఒకటి థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇందు కీ జవానీ’ సినిమాను డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. మరి కియారా సినిమాను చూడడానికి ప్రేక్షకులు ఏ స్థాయిలో వస్తారో తెలియదు.యాభై శాతం అమ్మకంతో బిజినెస్ ఎలా జరుగుతుందనేది తెలుసుకోవడానికి ఈ సినిమా కొంతవరకు హెల్ప్ చేస్తుంది.