బాబు మోహన్, కోటా వీరిద్దరి కొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఇదే విషయాన్ని ప్రస్తావించిన కోటా శ్రీనివాస్ రావు .. బాబు మోహన్ కి ఉద్దేశిస్తూ.. ‘వాడికి, నాకూ ఓ కనెక్షన్ ఉంది.. వాడికి అబ్బాయి పోయాడు, నాకూ అబ్బాయి పోయాడు. కాకపోతే వాడికి కొంచెం అదృష్టం ఏంటంటే.. ఇంకో కొడుకు ఉన్నాడు. నా ఒక్కగానొక్క కొడుకు పోవడం’ అంటూ ఎమోషనల్ అయి ఏడ్చేశారు. ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంయాదృచ్ఛికం అంటూ బాబు మోహన్ కూడా కన్నీరు పెట్టుకున్నారు.ఇలా వీరి బాధను చూసిన సాటి ప్రేక్షకులు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు.