రిచా మాట్లాడుతూ ‘మార్కెటింగ్‌లో ఎంబీఏ చేయాలనేది నా చిన్ననాటి కల. ఆ ఛాన్స్ రావడంతో సినిమా ఇండస్ట్రీని వదిలేసి అమెరికా వెళ్లిపోయాను. చాలామంది సినిమాలకు దూరం కావొద్దని సలహాలు ఇచ్చినా.. నా మనసు ఎంబీఏ వైపే మొగ్గు చూపింది. సినిమాలు వదిలేసి చదువుకోవడమే సరైన నిర్ణయమని భావించా. చదువు పూర్తి కాగానే నా క్లాస్‌మేట్‌నే పెళ్లి చేసుకున్నా.సినిమా ఇండస్ట్రీని వదిలేసినందుకు నాకేమీ బాధలేదు. ప్రస్తుతం నా వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది’ అని చెప్పుకొచ్చింది రిచా.