కృతి ప్రేమ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ‘పులకిత్ చాలా మంచి వ్యక్తి అని, ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో రిలేషన్షిప్లో ఉన్నాం. ఏడాదిన్నరగా డేటింగ్ చేస్తున్నాం. అయితే ఇద్దరి ఫోకస్ ఇప్పుడు కెరీర్ మీదే ఉంది. అందువల్ల ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించిన తర్వాతే పెళ్లి చేసుకుంటాం’ అని కృతి చెప్పుకొచ్చింది. కృతి, పులకిత్ ఇద్దరు కలిసి ‘పాగల్ పంథీ’ చిత్రంలో కలిసి నటించారు.