వరుణ్ కెరీర్ లో "ఎఫ్ 2" సినిమా బిగ్గెస్ట్ హిట్ అని తెలుసు.అనిల్ రావిపూడితో తీసిన ‘ఎఫ్ 2’ సినిమా ఒప్పుకున్న సమయంలో వరుణ్ తేజ్ కి మంచి మంచి హిట్ సినిమాలు వున్నాయి. అయినా కాని వెంకటేష్ లాంటి హీరోతో కలిసి నటించడానికి ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు.రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేయకుండా దిల్ రాజు ఇస్తానని చెప్పిన మొత్తాన్నే తీసుకున్నాడు. పాత్ర పరంగా కూడా ఎలాంటి డిమాండ్లు వరుణ్ చేయలేదట.కానీ ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తోన్న సినిమా విషయంలో మాత్రం వరుణ్ పారితోషికం విషయంలో ఎంత మాత్రం తగ్గే ఛాన్స్ లేదంటున్నాడట. తన పారితోషికం పెంచి ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడట.