ప్రభా్సకు ఉన్న క్రేజ్, డిమాండ్ దృష్టిలో పెట్టుకొని కోట్లు కుమ్మురించడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు.ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో తయారవుతున్నాయి.ప్రభాస్, పూజా హెగ్టే జంటగా రూపుదిద్దుకొంటున్న పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా 'రాధేశ్యామ్' దాదాపు రూ. 250 కోట్లతో రూపుదిద్దుకొంటోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. తెలుగు సహా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 'రాధేశ్యామ్' విడుదలవుతుంది.ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు.. రీసెంట్ గా విడుదల తేదీని కూడా కన్ఫర్మ్ చేశారు చిత్ర నిర్మాతలు. ప్రభాస్ శ్రీరాముడి పాత్రను పోషించే ఈ చిత్రం రూ. 450 కోట్ల బడ్జెట్తో రూపొందనుంది. 2022 ఆగస్టు 11న 'ఆదిపురుష్' విడుదలవుతుంది.ఆ తర్వాత 'మహానటి' చిత్ర దర్శకుడు నాగ్అశ్విన్ ప్రభాస్ హీరోగా రూపొందించనున్న సైన్స్ ఫిక్షన్ రూ. 300 కోట్ల బడ్జెట్తో రూపుదిద్దుకోనుందని సమాచారం.ఇలా ప్రభాస్ కోసం కేవలం ఈ మూడు ప్రాజెక్టులతో వెయ్యి కోట్ల బడ్జెట్ ను ఆ చిత్ర నిర్మాతలు ఖర్చు చేస్తున్నారం