ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' మూవిని రీమేక్ చేయనున్నాడు. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ గా మెగాస్టార్ చాలా పేర్లనే పరిశీలించారు. మొదటగా సాహూ ఫేం సుజిత్ పేరు వినిపించింది. ఆ తర్వాత వినాయక్ లైన్లోకి వచ్చాడు. లూసిఫర్ రీమేక్ ను తానే డైరెక్ట్ చేస్తున్నట్టు వినాయక్ ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించాడు. కాగా ఆ తరవాత వినాయక్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి తపుకున్నట్టు వార్తలు వచ్చాయి.దాంతో లూసిఫర్ రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నదానిపై మరోసారి చర్చ మొదలయ్యింది. తాజా సమాచారం ప్రకారం లూసిఫర్ తమిళ దర్శకుడు మోహన్ రాజానే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.లూసిఫర్ రీమేకును కూడా రాంచరణ్ నిర్మాతగా కొణిదెల బ్యానర్ లో తెరకెక్కించనున్నారు.