తమిళ నటుడు సూపర్ స్టార్ విజయ్ కు తమిళ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా అంటేనే అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటారు. ఈ మధ్యకాలంలో మరింత స్పీడ్ పెంచారు విజయ్... ఆయన నటించిన ప్రతి సినిమా కూడా 100 కోట్లు వసూలు చేస్తూ ఆయన ఫాలోయింగ్ కు నిదర్శనంగా మారింది. అలా ఆ రేంజ్ ను ఓ రేంజ్ లో సెట్ చేసుకున్న విజయ్ తమిళ సినిమా పరిశ్రమకే పరిమితం కానున్నారా అనే టాక్ ఈ మధ్య వినిపించింది.