నితిన్ సరసన రంగ్ దే సినిమాలో నటిస్తోంది కీర్తీ.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. ఇందులో భాగంగా ఇటీవలే చిత్రయూనిట్ దుబాయ్ వెళ్లారు. ఉంటే.. తాజాగా లొకేషన్లో ఒక సరదా సన్నివేశాన్ని షేర్ చేశారు నితిన్.షాట్ గ్యాప్లో కీర్తి సురేష్ చక్కగా చెట్టు కింద కుర్చీ వేసుకుని ముఖం మీద కర్చీఫ్ వేసుకుని గుర్రుగా నిద్రపోతోంది. దాన్ని గమనించిన నితిన్ కీర్తి సురేష్ వెనుక నిలబడి వెంకీ అట్లూరితో కలిసి ఫొటో తీసుకున్నాడు. దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. మేము కష్టపడి చెమటలు కక్కుతుంటే కీర్తి సురేష్ మాత్రం ఇలా రిలాక్స్ అవుతోంది అంటూ సెటైర్ వేశారు.  దీనికి స్పందించిన కీర్తి.. మీకు అసూయగా ఉంది కదా అంటూ రివర్స్ ఎటాక్ చేసింది. మొత్తానికి నితిన్ షేర్ చేసిన ఫొటో వైరల్గా మారింది.