తాజాగా ఆమిర్ కుమార్తె ఐరా ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. రీసెంట్గా తన మానసిక సమస్యలు, తనపై జరిగిన లైంగిక దాడి విషయాలను బయటపెడుతూ సంచలనం సృష్టించిన ఆమె.. తాజాగా డేటింగ్ వ్యవహారంతో జనం నోళ్ళలో నానుతోంది. తన ఫిట్నెస్ ట్రైనర్తో ఆమె ప్రేమాయణం నడుపుతుండటం బీ టౌన్ వర్గాల్లో హాట్ ఇష్యూగా మారింది. గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి అతనితో బ్రేకప్ చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఫిట్నెస్ ట్రైనర్ నుపూర్ శిఖారెతో డేటింగ్ చేస్తోంది ఐరా ఖాన్.దీని పై నెటిజనులు ఆమెపై కోపంతో నోరు పారేసుకుంటున్నారు. ఛీ ఛీ నీకు సిగ్గు లేదా..! అంత పెద్ద స్టార్ కడుపున పుట్టి ఆయన పరువు తీస్తావా..! అంటూ సోషల్ మీడియాలో తిడుతున్నారు.