జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్ కళ్యాణ్‌కు ఏమైందో నిజంగా నాకు అర్థం కావట్లేదు. పవన్ రాజకీయ నిర్ణయాలపై చాలా నిరుత్సాహం చెందాను. నువ్వొక లీడర్.. మీకొక పార్టీ ఉంది.. మళ్లీ ఇంకో నాయకుడి వైపు వేలు చూపించడం ఏంటి? ఏపీలో గాని, ఇంకో చోట గాని.. జనసేన ఓట్ షేర్ ఎంత.. బీజేపీ ఓటు షేర్ ఏంటి? 2014లో మీరే బీజేపీ వాళ్లు అద్భుతం, ఇంద్రుడు, చంద్రుడు అన్నారు. మళ్లీ గత ఎన్నికల్లో లేదు, వాళ్లు ద్రోహులు అన్నారు! మళ్లీ ఇప్పుడు వీళ్లే నాయకులుగా కనిపిస్తున్నారు అంటున్నారు. అంటే, ఇలా మూడు, నాలుగు సార్లు మారుతున్నారంటే.. మీరు ఊసరవెల్లి అయి ఉండాలి కదా."అని కామెంట్స్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నాడు.