ప్రస్తుతం సుకుమార్.. అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' సినిమా తెరకెక్కుతోంది.  ఇప్పటి వరకు సింగిల్ స్టారర్ సినిమాగా ఉన్న పుష్ప ఇకపై మల్టీస్టారర్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలో నందమూరి హీరో నారా రోహిత్ నటిస్తున్నాడు. సినిమాలో అతి కీలకమైన పాత్రలో ఈయన నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంది. దాని కోసం ఇప్పటికే విజయ్ సేతుపతి, సముద్రఖని, సుదీప్, బాబీ సింహ లాంటి నటుల పేర్లు వినిపించాయి. అయితే కొన్ని డేట్స్ కారణంగా.. మరికొన్ని అనివార్య కారణాలతో ఈ సినిమా నుంచి వాళ్ల తప్పుకున్నారు. ఇప్పుడు ఈ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విక్రమ్ ను దర్శకుడు సుకుమార్ అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో విభిన్నమైన కథల వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్న విక్రమ్.. పుష్ప కథకు కచ్చితంగా ఓకే చెబుతాడని వార్తలు వినిపిస్తున్నాయి.