సమంత, తమన్నా ఆహా యాప్ పబ్లిసిటీ బాధ్యతను వారి భుజాలపై వేసుకున్నారు. కేవలం సినిమాలపైనే ఫోకస్ చేయకుండా రియాలిటీ షోలతో హైప్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అది కూడా అగ్ర తారలతో..అదే విధంగా రెగ్యులర్ వెబ్ సిరీస్ లు కాకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలని అనుకున్నట్లు ఇటీవల క్లారిటీ ఇచ్చేశారు. సమంత సామ్ జామ్ తో పాటు తమన్నా లేవంత్ హావర్ వెబ్ సిరీస్ లు జనాలను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక ప్రస్తుతం వీరి రెమ్యునరేషన్ విషయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరికి దాదాపు కోటికి పైగానే ఇస్తున్నారట. అయితే సమంత కంటే తమన్నాకే ఎక్కువ రెమ్యునరేషన్ అందుతున్నట్లు తెలుస్తోంది. తమన్నా చేస్తున్న వెబ్ సిరీస్ కు దాదాపు రూ.1.8కోట్ల వరకు అందుతుమనట్లు సమాచారం.