ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ RRRసినిమాలో మెగాస్టార్ చిరంజీవి భాగస్వామి కాబోతున్నారని తెలుస్తోంది.సినిమా కోసం మెగాస్టార్‌ను అడగగానే రాజమౌళికి చిరంజీవి ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయితే అనవసరంగా పాత్రను క్రియేట్ చేయకూడదని భావించిన జక్కన్న.. వాయిస్ ఓవర్ కోసం ని అడిగి ఒప్పించారని తెలుస్తోంది.అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరరణ్, గోండు ముద్దుబిడ్డ కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న విషయం తెలిసిందే.  ఈ రెండు పాత్రలను సినిమాలో పరిచయం చేసేందుకు స్టార్ హీరో వాయిస్ ఓవర్ అవసరమని ఆర్ఆర్ఆర్ యూనిట్ భావించింది. ఇందుకోసం రాజమౌళి అడగ్గానే చిరంజీవి మెగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. సినిమాలో కనిపించకున్నా.. చిరంజీవి వాయిస్ అయినా మాకు చాలంటూ మెగా అభిమానులతో పాటు నందమూరి ఫ్యాన్స్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇతర భాషల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని వినిపిస్తోంది.