తాజాగా 'పుష్ప'  సినిమాలో తమిళ స్టార్ హీరో విక్రమ్..బన్నీ కి విలన్‌గా నటించనున్నాడంటూ ఇటీవల ఆన్లైన్లో విరివిగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన 'పుష్ప'లో భాగం కావట్లేదని తెలిసింది. మొదట డేట్స్ సమస్య కారణంగా విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ నుంచి అధికారికంగా తప్పుకున్నాడు. దాంతో చియాన్ విక్రమ్‌ను సుకుమార్ సంప్రదించి, ఆయనకు కథ వినిపించాడనీ, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ స్పెక్యులేషన్ జరిగింది.విక్రమ్ అయితే ఆ క్యారెక్టర్‌కు న్యాయం జరుగుతుందని బన్నీ కూడా భావించడానీ, ఆయన వస్తే ప్రాజెక్టుకు మరింత ప్రయోజనం చేకూరుతుందని అనుకున్నాడనీ చెప్పుకున్నారు. అయితే విక్రమ్ సన్నిహిత వర్గాలు ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. అవన్నీ కేవలం వదంతులనీ, 'పుష్ప'లో విలన్‌గా విక్రమ్ నటించట్లేదనీ ఆ వర్గాలు స్పష్టం చేశాయి.