ప్రస్తుతం అనిల్ రావిపూడి F2 కు సీక్వెల్ గా F3 సినిమాని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు. ఇక F2లో వెంకటేష్ తో కలిసి నటించిన వరుణ్ తేజ్.. ఈ సీక్వెల్ లో కూడా నటించనున్నాడు. అయితే ఈ సినిమాకి వరుణ్ తేజ్ హై రెమ్యూనరేషన్ ని అడుగుతున్నాడట. వెంకీ తీసుకునే రెమ్యూనరేషన్ కు సమానంగా అంటే దాదాపు 12 కోట్లు ఇవ్వాలని అడుగుతున్నట్లు తాజా సమాచారం. వరుణ్ తేజ్ ఇప్పటివరకు ఒక్కో సినిమాకు 7 నుంచి 8 కోట్లు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏకంగా నాలుగు కోట్లు ఎక్కువ. కరోనా కారణంగా హీరోలందరూ 20 శాతం తగ్గించాలని దిల్ రాజ్ తో కూడిన "ఆక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్" ఆదేశాలు ఇచ్చింది. కానీ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాకే హీరోలు పారితోషికాలు పెంచుతున్నారు.