అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్న కొత్త సినిమా 'గాలి సంపత్'. అనిల్ కో డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ గాలి సంపత్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అరకులో జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్, హీరో శ్రీ విష్ణుతో పాటు సినిమాలో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుంది.