తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చిన్నపిల్లల దుస్తుల వ్యాపారం ప్రారంభించారు. ఇందులో పెట్టుబడులకు కూడా ఆమె ఆహ్వానం పలుకుతోంది. తాను ప్రారంభించిన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. అలియాభట్ 'ఎడ్ ఏ మమ్మా' పేరుతో చిన్నపిల్లల దుస్తుల వ్యాపారం నిర్వహిస్తోంది. విజయ్ దేవరకొండ లాగా దుస్తుల వ్యాపారంలో క్లిక్ అయ్యేందుకు ఆమె ఫోకస్ పెట్టింది.దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ అమ్మడు తన ప్రమోషన్ ని కూడా మొదలు పెట్టిందట.