కొమురం భీం జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన కొమరం భీమ్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.తాజాగా ఈ టీజర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ టీజర్ కి ఇప్పటివరకు రెండు లక్షలకి పైగా కామెంట్లను దక్కించుకుంది. ఈ స్థాయిలో కామెంట్లు వచ్చిన టీజర్ టాలీవుడ్ లోనే ఇదే మొదటిది కావడం విశేషం. ఇక ఇప్పటివరకు ఈ టీజర్ కు మూడు కోట్ల ఇరువై ఆరు లక్షల వ్యూస్ రాగా, 11 లక్షలకి పైగా లైక్స్ వచ్చాయి.ఇలాంటి అరుదైన రికార్డు ఎన్టీఆర్ సినిమా టీజర్ కి దక్కడం అనేది విశేషం అనే చెప్పాలి.