తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పాత సినిమాలను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వరుణ్ తేజ్.. పనవ్ కళ్యాణ్ నటించిన 'జానీ' సినిమాతో పాటు చిరంజీవి హీరోగా నటించిన ఛాలెంజ్, కొదమ సింహం సినిమాలు వరుణ్ తేజ్ ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.  ఇక ఈ రెండు సినిమాల విషయానికొస్తే.. చిరు కెరీర్లో మంచి హిట్ సినిమాలుగా మిగిలాయి.అందులో ఛాలెంజ్ సినిమా విషయానికొస్తే.. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కే.యస్.రామారావు నిర్మించారు. ఛాలెంజ్ విషయానికొస్తే.. మనిషి తలుచుకుంటే ఏమైనా సాధించగలడనే దానికి ఈ సినిమా స్పూర్తిగా నిలించింది. కొదమ సింహం విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని కే.మురళీ మోహన్ రావు డైరెక్ట్ చేసారు.రెండు సినిమాలు వరుణ్ తేజ్ ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు వరుణ్ తేజ్ హీరోగా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా టతెలుస్తోంది . మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో స్పెషల్ చిత్రాలుగా నిలిచిన ఈ రెండు సినిమాలను వరుణ్ తేజ్ రీమేక్ చేయాలనుకోవడం అనేది నిజంగా ఓ పెద్ద సాహసమే అని చెప్పాలి.