ఆర్.ఆర్.ఆర్ షూటింగుతో బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలా శంషాబాద్ లో కెమెరా కంటికి చిక్కారు. ఆయన ఊబర్ కూల్ లుక్ పై అభిమానులు రకరకాలుగా ప్రశంసలు కురిపిస్తున్నారు. తారక్ ఎక్కడ ఉన్నా ఆ స్టైలే వేరు.చాలా సందర్భాల్లో కూల్ గా ప్లెజెంట్ గా ఉంటాడు. అతడి రూపానికి తగ్గ డిజైనర్ లుక్ తో ఆకర్షిస్తాడు. తాజాగా క్యాజువల్ - కూల్ లుక్ తో ఈసారి కూడా కనిపించాడు. ఆకుపచ్చ టీ-షర్టు క్రీమ్-రంగు చినోస్ కలయికతో స్టైలిష్ గా ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు అందరినీ ఎంతో ఆతృతగా మైమరిపిస్తోంది.