ఆహా స్థాయిని పెంచేందుకు అల్లు అరవింద్ వేసిన ప్లాన్ సామ్ జామ్. ఇప్పటికే మొదలయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ షో తరువాయి ఎపిసోడ్ల కోసం మరి కొందరు సెలబ్రటీలను కలిసారు.వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడు. అయితే మన డార్లింగ్ మాత్రం ఈ షోపై అంతగా ఆసక్తి చూపలేదట.దీంతో ఆ టీమ్‌ని కొంచెం టచ్‌లో ఉండండి చెప్తా అన్నాడట. స్పతహాగానే ప్రభాస్‌కు సిగ్గెక్కువ.డిజిటల్ షోల వంటి వాటికి చాలా దూరంగా ఉంటాడు ఈ హీరో..  ఇంతకుమందు ఒకసారి ప్రదీప్ మాచిరాజు షో కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా షోలో పాల్గొన్న ప్రభాస్.. ఆ తరువాత కొన్నాళ్లకు రానా, రాజమౌళితో కలిసి హిందీ షో కాఫీ విత్ కరన్‌కు వెళ్లాడు. అంతే మళ్లీ ఇప్పటి రకు ఏ షోలోనూ కనిపించలేదు.