ఎప్పటినుంచో చాలా హిట్ సినిమాలకు కథ మరియు స్క్రీన్ ప్లే అందించి మంచి రచయిత గా పేరు తెచ్చుకున్న 'కోన వెంకట్' తాజాగా బాలకృష్ణ కు ఓ మాస్ కథను వినిపించి ఓకే చెప్పించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మీడియా వర్గాల్లో వినిపిస్తున్న టాక్ మేరకు బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమాతో పాటు ఇప్పటికే కమిట్ అయిన ఒక సినిమాను చేసిన తర్వాత కోన సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడట.  బాలకృష్ణ కోసం మాస్ ఎంటర్ టైనర్ కథను కోనా రెడీ చేశాడట.ఆ కథ బాగా నచ్చడంతో కోన వెంకట్ కు బాలయ్య ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు శ్రీవాస్ డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. మాస్ ఎంటర్ టైనర్ సినిమాలను శ్రీవాస్ చక్కగా డీల్ చేయగలడు అంటూ ఇప్పటికే నిరూపితం అయ్యింది. అందుకే ఆయనకు ఈ దర్శకత్వ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు.త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.