కొరటాల శివ అల్లు అర్జున్ తో సినిమా చేయనున్నట్లు  ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.ఇక సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కనున్నట్లు మొదటి నుంచి అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. యువ రాజకీయ నాయకుడిగా బన్నీ సరికొత్తగా కనిపించనున్నట్లు టాక్ వస్తోంది.సినిమా ఫస్ట్ హాఫ్ ఒక కాలేజ్ యువకుడు రాజకీయ నాయకుడిగా ఎలా మారతాడు అనే కాన్సెప్ట్ లో నడుస్తుందట. ఇక సెకండ్ హాఫ్ లో రియల్ పాలిటిక్స్ ని తలపించే రేంజ్ లో బన్నీ పెర్ఫెమెన్స్ ఉంటుందని ఫైనల్ గా కొరటాల కొట్టినట్లు ఒక స్ట్రాంగ్ మెస్సేజ్ ఇస్తాడాని సమాచారం. యువకులు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనే పాయింట్ మీదనే సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఈ న్యూస్ చక్కర్లు కొడుతోంది.