సమంత, చైతూ ప్రేమకథలో సినిమాను మించిన ట్విస్టులు ఉన్నాయి. వీళ్లు ప్రేమించుకున్నాం అని చెప్పగానే కుటుంబ సభ్యులు ఈజీగా ఏం ఒప్పుకోలేదు. దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది కూడా. ఎందుకంటే నాగ చైతన్యను పెళ్లాడాలంటే రెండు కుటుంబాలను ఒప్పించాలి. అక్కినేని కుటుంబంతోపాటు దగ్గుబాటి కుటుంబాన్ని కూడా ఒప్పిస్తే కానీ అక్కినేని కోడలు కాలేదు. సమంత అన్నంత పనిచేసి అందర్నీ ఒప్పించి తన ప్రేమను గెలిపించుకుంది. అయితే సమంత ప్రేమ గెలవడానికి ఒకరి హస్తం మాత్రం చాలానే ఉంది. ఆయనెవరో కాదు రానా దగ్గుబాటి. చైతూకు చిన్నప్పటి నుంచి మంచి దోస్త్ రానా. ఇద్దరూ బావా బామ్మర్దులు అయినా కూడా క్లోజ్ ఫ్రెండ్స్ మాదిరే ఉంటారు.ప్రతీ విషయంలో చైతూకు వెన్నంటే ఉంటాడు రానా.  చివరికి పెళ్లి విషయంలో కూడా రానానే ఉన్నాడు. సమంత, చైతూ ప్రేమించుకున్న విషయం ఇంట్లో చెప్పి ఒప్పించడంలో రానా చాలా కీలక పాత్ర పోషించాడు. ఇదే విషయం సమంత కూడా చెప్పింది. ఈ మధ్యే ఓ షోకు వచ్చిన రానాకు సభాముఖంగా అందరి ముందు థ్యాంక్స్ చెప్పింది.