RRR చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటికొచ్చింది. ఇందులో భారీ పోరాట సన్నివేశాలున్నాయట. అటవీ ప్రాంతంలో 300 మంది ఆదివాసులు, 100 మంది పోలీసుల మధ్య ఎన్టీఆర్పై భారీ యాక్షన్ సీన్ చిత్రీకరించారట రాజమౌళి. ఆ పోరాట సన్నివేశాలు దాదాపు 20 నిమిషాల నిడివితో ఉంటాయని సమాచారం. ఆ సందర్భంలోనే తొలిసారి అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కలుస్తారనీ, అక్కడి నుంచే ఇద్దరూ ఒక్కటై పోరాటం కొనసాగిస్తారని తెలిసింది. అయితే 25 నిమిషాల నిడివితో చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు సినిమాలో ఓ రేంజ్ లో హైలైట్ అవ్వనున్నాయని..రేపు సినిమా విడుదలయ్యాక థియేటర్లలో ఈ సీన్స్ మెగా, నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిచడం ఖాయమని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.