'లూసిఫర్ తెలుగు రీమేక్ ను మరోదర్శకుడు మోహన్ రాజాకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. స్క్రిప్ట్ విషయంలో మెగాస్టార్ సంతృప్తి చెందలేదని.. అందుకే మెహర్ రమేష్ సినిమాని లైన్ లో ముందుకు తీసుకువచ్చారని.. దాంతో 'లూసిఫర్' మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్ లో మార్పులు చేయనున్నారట. ఇక 'లూసిఫర్'లో మంజు వారియర్ హీరోకి చెల్లి పాత్రలో నటించింది. తెలుగులో ఈ పాత్రలో సుహాసిని కనిపించబోతుందట. కాగా ఈ సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉండేలా.. మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నారట దర్శకనిర్మా తలు.