నందమూరి సింహాలు బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్లను ఒకేసారి వెండితెరపై చూడాలని నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ ఇప్పటికే ‘యన్.టి.ఆర్’ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ బోయపాటి సినిమాలో కలిసి నటించబోతున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ అతిథి పాత్ర చేయబోతున్నాడని టాక్ నడుస్తుంది.ఇంటర్వెల్ బ్లాక్లో కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు.