ఈ ముద్దుగుమ్మ మాత్రం తను చిన్నప్పుడు గాయని కావాలనుకుంది. కొంచెం పెరిగి పెద్దయ్యక పుస్తకాల పురుగ్గా మారిపోయింది. దాంతో గాయని కాస్తా కలెక్టర్ కావాలని కలలుకంది. కానీ విధి తనని యాక్టర్ చేసింది. తొలి చిత్రం ఊహలు గుసగుసలాడే తో కుర్రకారును ఒక ఊపు ఊపింది. కలల రాకుమారిలా మారి కుర్రకారును ఆగం చేసింది. తనే అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.