నేషనల్ అవార్డు దక్కించుకోవాలి అనే కోరిక తన తల్లికి బలంగా ఉండేదని కీర్తి సురేష్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.నిజానికి కీర్తి సురేష్ తల్లి కూడా పెద్ద స్టార్ హీరోయినే..! సినీ పరిశ్రమ ఒకటిగా ఉండే రోజుల్లో… తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది కీర్తి సురేష్ తల్లి మేనక. తెలుగు, తమిళ్ తో పాటు మలయాళం కన్నడ భాషల్లో కలుపుకుని ఏకంగా 116 సినిమాల వరకూ నటించింది.మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'పున్నమి నాగు' చిత్రంలో కూడా మేనక హీరోయిన్ గా నటించింది. ఈమె కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైములో నిర్మాత జి.సురేష్ కుమార్ ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది మేనక. ఈమెకు ఇద్దరు కూతుళ్లు. ఒకరు రేవతి సురేష్ కాగా మరొకరు కీర్తి సురేష్.ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు.