ప్రభాస్‌ని మరోసారి డైరెక్ట్ చేస్తారా? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళికి ఓ ప్రశ్న ఎదురైంది.దీనికి రాజమౌళి సమాధానమిస్తూ.. ''వామ్మో.. మళ్లీ ప్రభాస్‌తోనా?.. బాహుబలి కోసం దాదాపు 5 సంవత్సరాలు కలిసి చేశాం. మళ్లీ మా కాంబినేషన్లో సినిమా అంటే.. జనాలు తలలు పట్టుకుంటారేమో..'' అని అన్నారు. ఇదంతా నిజమే అనుకుంటున్నారేమో? కాదు..మన రాజమౌళి ఈ మాటలు సరదాగా మాట్లాడారు. పై మాటలు అన్న తర్వాత సరదాగా నవ్విన రాజమౌళి.. ''సరదాగా అలా అన్నాను.. నిజంగా ప్రభాస్‌తో సినిమా చేయడం నాకు కూడా ఇష్టమే. మంచి కథ కుదిరితే.. తప్పకుండా మేం మళ్లీ సినిమా చేస్తాం..'' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.మళ్ళీ ఈ కాంబినేషన్ కోసం చాలా మంది ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.